‘నిన్ను చంపేస్తాం.. అత్యాచారం చేస్తాం’
Encrypting your link and protect the link from viruses, malware, thief, etc! Made your link safe to visit. Just Wait...

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత బాలీవుడ్‌లో బంధుప్రీతి మీద విపరీతమైన చర్చ జరిగింది. ముఖ్యంగా ఖాన్‌లు, కపూర్‌ల కుటుంబాలతో పాటు కరణ్ జోహర్ మీద కూడా తీవ్రమైన విమర్శలు వచ్చాయి. వీరి వల్ల టాలెంట్ ఉన్న వారికి అవకాశాలు రాక.. ఎందరో కుంగి పోతున్నారని.. కొందరు సుశాంత్ లాగా తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని నెటిజనులు ఆరోపించారు. బాలీవుడ్‌లో ఓ పెద్ద మాఫియా ఉందని దాని వలనే సుశాంత్ మరణించాడంటూ కంగనాతో పాటు పలువురు.. ఇండస్ట్రీలోని పెద్దలపై నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. ఇకపోతే ఇన్ని రోజులు మహేష్ భట్, ఆలియా భట్‌లపై విమర్శలు చేసిన వారు తాజాగా ఆమె సోదరి షాహీన్ భట్‌ను వేధిస్తున్నారట.
ఆమెను చంపేస్తామని.. అత్యాచారం చేస్తామని బెదిరిస్తూ మెసేజ్ చేస్తున్నారట. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు షాహీన్. ఇవి తనను ఎలాంటి ఆశ్చర్యానికి గురి చేయడం లేదన్నారు. అంతేకాక ఈ తరహా విద్వేష పూరిత బెదిరింపుల్ని సీరియస్‌గా తీసుకుని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు వెల్లడించారు. గుర్తు తెలియని సైట్ల నుంచి ఇలాంటి బెదిరింపులు పాల్పడే వారిని ఐపీ అడ్రెస్‌లతో గుర్తించడం ఖాయమని అంటున్నారు షాహీన్.