రోజూ నరకం చూపించే కొడుకునుపొడిచేశాడు..!
Encrypting your link and protect the link from viruses, malware, thief, etc! Made your link safe to visit. Just Wait...
సంఘటన స్థలిలోనే మృతిచెందిన జగదీష్
తెనాలి టౌన్, న్యూస్‌టుడే: మద్యం తాగేందుకు డబ్బు ఇవ్వమని రోజూ పీడిస్తూ, కొడుతున్న కొడుకు ఆగడాలను ఇక ఆ తండ్రి భరించలేకపోయాడు. తీవ్ర ఆవేదన, కోపంతో కన్న కుమారుడ్నే ఇంట్లో ఉన్న కత్తితో పొడిచి హతమార్చాడు. ఈ ఉదంతం గుంటూరు జిల్లా, తెనాలిలో గురువారం అర్ధరాత్రి జరిగింది. తెనాలి మూడో పట్టణ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. పట్టణంలోని పాండురంగపేటకు చెందిన దుద్దుకూరు సీతాపతి ఒక హోటల్‌లో పనిచేస్తారు. ఈయన భార్య గృహిణి. ఈ దంపతుల ఇద్దరు కుమారులు క్యాటరింగ్ పనులకు వెళుతుంటారు. చిన్న కొడుకైన జగదీష్ (28) మద్యానికి బానిసగా మారాడు. గత 5 ఏళ్లుగా ఇతను రోజూ మద్యం తాగి ఇంటికి వచ్చి తల్లిదండ్రులు, సోదరుడితో గొడవ పడేవాడు. లాక్‌డౌన్ నేపథ్యంలో కొన్ని నెలలుగా పనులు లేనందున ఇతను మద్యం తాగేందుకు డబ్బు ఇవ్వమని రోజూ తల్లిదండ్రులను వేధిస్తూ, వారిని కొడుతున్నాడు. గురువారం రాత్రి 9 గంటల సమయంలో ఇంటికొచ్చిన జగదీష్ సోదరుడితో గొడవ పడి వెళ్లిపోయాడు. తిరిగి అర్ధరాత్రి వచ్చి మరోమారు ఘర్షణ పడ్డాడు. నచ్చచెప్పబోయిన తల్లిని తీవ్రంగా కొట్టాడు. సహనం కోల్పోయిన తండ్రి సీతాపతి కూరగాయలు కోసే కత్తితో జగదీష్‌ను పొడిచాడు. తీవ్ర రక్తస్రావంతో అతను సంఘటన స్థలిలోనే మృతిచెందాడు. పోలీసులు సీతాపతిని అదుపులోకి తీసుకున్నారు