ఓడిపోవడం వల్లనే పవన్‌కు ఉత్తరాంధ్రపై ద్వేషం - Local news
Encrypting your link and protect the link from viruses, malware, thief, etc! Made your link safe to visit. Just Wait...

రాజకీయాలకు ఆయన పనికిరారు
విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేస్తే మీకేంటి బాధ
చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మండిపాటు
సాక్షి, విశాఖపట్నం: పవన్‌కల్యాణ్ రాజకీయాలకు పనికిరారని వైఎస్సార్‌సీపీ చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. జనసేన పార్టీ ఎందుకు పెట్టారో తెలియని పరిస్థితిలో పవన్ ఉన్నారన్నారు. గాజువాక వుడా కాలనీలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే
విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తే మీకేంటి బాధ? గాజువాక నియోజకవర్గం నుంచి పోటీ చేసి పవన్ ఓడిపోవడంతో ఉత్తరాంధ్రపై ద్వేషం పెంచుకున్నారు.
► విశాఖ ప్రజలు ఛీదరించారని ఆ ప్రాంతం అభివృద్ధి కాకుండా అడ్డుపుల్ల వేసేందుకు ప్రయత్నిస్తున్నారని అర్థమవుతోంది.
► ప్రశ్నించడం కోసం అంటూ పార్టీ పెట్టి ఆరు నెలలకోసారి ఒక ప్రశ్న వేసి తర్వాత కనిపించని పవన్ మూడు రాజధానులు ఎలా ఇస్తారని ప్రశ్నించడం హాస్యాస్పదం.
► టీడీపీతో ఐదేళ్ల పాటు కాపురం చేసిన పవన్‌కు అమరావతి.. అప్పుడు భ్రమరావతిగా కనిపించలేదా?
► నిజమైన రాజకీయ నాయకుడు అయితే నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలపై పోరాటాలు చేయాలి
► భూస్థాపితం అయిన పార్టీల నాయకులు ఉనికిని చాటుకోవడం కోసమే పనికిరాని స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు.