వన్‌ప్లస్ నార్డ్ వచ్చేసింది..ధర ఎంతంటే
Encrypting your link and protect the link from viruses, malware, thief, etc! Made your link safe to visit. Just Wait...

"ఫాస్ట్ అండ్ స్మూత్" వన్‌ప్లస్ నార్డ్ ఆవిష‍్కరణ
మూడు వేరియంట్లలో లాంచ్
సాక్షి, ముంబై: వన్‌ప్లస్ కొత్త మొబైల్ ‘నార్డ్’ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. 5జీ కనెక్టివిటీ, పంచ్ హోల్ డిస్‌ప్లే డిజైన్, క్వాడ్ రియర్ కెమెరా ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయని కంపెనీ ప్రకటించింది. అంతేకాదు "ఫాస్ట్ అండ్ స్మూత్" అనుభవాన్ని అందించడానికి వన్‌ప్లస్ నార్డ్‌కు దాదాపు 300 ఆప్టిమైజేషన్లను అందించినట్లు కంపెనీ పేర్కొంది.
మూడు వేరియంట్లలో లాంచ్ చేసిన వన్‌ప్లస్ నార్డ్ ఆగస్టు 4 నుండి అమెజాన్, వన్‌ప్లస్.ఇన్ ద్వారా భారతదేశంలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. అయితే, ప్రారంభంలో 8 జీబీ, 12 జీబీ ర్యామ్ వేరియంట్లు మాత్రమే ఇవ్వబడతాయి. 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వెర్షన్ సెప్టెంబర్‌లో వస్తుంది. షావోమి ఇతర సంస్థల మాదిరిగా కాకుండా, వన్‌ప్లస్ మొదటి రోజు నుండి నార్డ్‌ను ఓపెన్ సేల్‌గా అందించనుంది. ప్రీ-బుకింగ్ వన్‌ప్లస్ ఎక్స్‌పీరియన్స్ స్టోర్స్ ద్వారా జూలై 22 నుంచి, జూలై 28 నుంచి అమెజాన్ ఇండియ లో అందుబాటులో ఉంటుంది.
ఇక ఆఫర్ల విషయానికొస్తే, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డులను ఉపయోగించి చేసిన కొనుగోళ్లతో 2 వేల రూపాయల తగ్గింపు. అదనంగా రిలయన్స్ జియో ద్వారా 6,000 విలువైన ప్రయోజనాలు లభ్యం. వన్‌ప్లస్ రెడ్ కేబుల్ క్లబ్ సభ్యులకు ప్రత్యేకంగా పొడిగించిన వారంటీ , బైబ్యాక్ ఆఫర్, 50 జీబీ విలువైన ఉచిత వన్‌ప్లస్ క్లౌడ్ స్టోరేజ్, ఇతర థర్డ్ పార్టీ ప్రయోజనాలు లభిస్తాయి.
వన్‌ప్లస్ నార్డ్ ధర
6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 24,999 రూపాయలు
8 జీబీ ర్యామ్+ 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్ ధర 27,999 రూపాయలు
12 జీబీ+ 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర 29, 999 రూపాయలు
వన్‌ప్లస్ నార్డ్ ఫీచర్లు
6.44 అంగుళాల డిస్ ప్లే
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 765 ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 10
1080x2400 పిక్సెల్స్ రిజల్యూషన్
32 + 8 మెగాపిక్సెల్ డబుల్ సెల్ఫీ కెమెరా
48+ 8+ 5+ 2మెగాపిక్సెల్స్ క్వాడ్ రియర్ కెమెరా
6జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్
4100ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం